పీడిత జన విముక్తి నేత బాబాసాహెబ్ అంబేద్కర్

0 8,904

 

. . . మల్యాల గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అణగారిన వర్గాల ఆశాజ్యోతి, పీడిత జన విముక్తి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ అని నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా నగరంలోని బహుజన కాలనీలో బహుజన సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు వేళ్ళునుకొని ఉన్న మను వాదపు కుల వివక్షతను ఎదిరించి, పీడిత జనాన్ని ఏకం చేసిన మహా నాయకుడు అంబేద్కర్ అని అన్నారు. ఆయన చదువు, భారతదేశ స్థితి గతులను మార్చే రాజ్యాంగపు శక్తిగా అవతరించిందనన్నారు. కానీ ఆ రాజ్యాంగాన్ని నీరుగార్చే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని, రాజ్యాంగ పరిరక్షణే ఆయనకు అర్పించే ఘన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సేవా సొసైటీ అధ్యక్షులు మారుతి, నాయకులు అలీ, ఇందిరమ్మ కమిటి సభ్యులు రమ, గోరేభాయ్, లావణ్య, గోపి, పర్వీన్, యశోద, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.