27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బిఎడ్, బిపిఎడ్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో  ఫిబ్రవరి 2025 మాసంలో జరిగిన బి.ఎడ్, బిపి. ఎడ్ 1 మరియు 3 సెమిస్టర్ పరీక్షలు ఫలితాలను తెలంగాణ వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు,  రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్, అడిషనల్ కంట్రోలర్ డా.టి సంపత్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.

  • తెయూ పరిధిలో డిగ్రీ పరీక్షల షెడ్యూలు విడుదల 

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని   డిగ్రీ రెగ్యులర్  రెండవ, నాలుగవ,ఆరవ సెమిస్టర్, బ్యాక్ లాగ్ ఒకటవ, మూడవ,ఐదవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 14 నుండి ప్రారంభమవుతాయని  ఈ పరీక్షలకు  11,617 విద్యార్థులు  32 సెంటర్లలో హాజరవుతారని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే. సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్  తెలిపారు.

More articles

Latest article