అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హిందూ ధర్మంలో భాగంగా వ్యక్తి యొక్క నడవడిక మానవ జీవన విధానం భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. వినాయక్ నగర్ రిలయన్స్ మాల్ ఎదురుగ కిసాన్ హైట్స్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో బిక్ష, అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్ పాల్ వినయ్ కుమార్ స్వామి చేతుల మీదుగా బ్రహ్మ శ్రీ బల్యపల్లి సుబ్బారావు స్వామి అంగరంగ వైభవంగా మహాపడి పూజ, అభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతు.. ప్రతి మనిషి తన జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకోవడంతో మానవ జన్మ పరిపూర్ణం అవుతుందని అన్నారు. తమ కుటుంబం నుండి గత ఇరవై ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అది తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకున్న నాటి నుండి కఠినమైన నియమ నిష్టలతో దైవ ఆరాధనలో ఎలాగైతే ఉంటారో దీక్ష అనంతరం కూడా హిందూ ధర్మం రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. భక్తిలో కూడా దేశ భక్తిని చాటే చెప్పే విధంగా మణికంఠునికి త్రివర్ణ పథకం రంగులతో అభిషేకం నిర్వహించడం అందరి భక్తులను ఆకట్టుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

