బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని శెట్పల్లి గ్రామం లో శనివారం కాంచన్ సీడ్స్ కంపెనీ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించారు. రైతుల పంట భూములకు తీసుకువెళ్లి మొక్క జొన్న పంటను ఏ విధంగా సాగు చేయాలి ఎక్కువ దిగుబడి రావాలంటే ఎటువంటి మెలుకువలు తీసుకోవాలో రైతులకు వివరించారు. ఈ కార్యక్రమం లో కాంచన్ సీడ్ మేనేజర్ జాకిర్, క్వాలిటీ మేనేజర్ భగత్, ఏలేటి జగన్ రెడ్డి, ఏలేటి బాను, రైతులు గురిజాల నర్సారెడ్డి, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
