27.5 C
Hyderabad
Friday, July 31, 2026

జాతీయస్థాయిలో ఏర్గట్ల విద్యార్థికి బహుమతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల : తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, మాచిరాజు, సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీలలో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి  చదువుతున్న అభిలాష్ రాసిన మంచి మనసు అనే కథకు జాతీయ స్థాయిలో బహుమతి లభించింది.  కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్  మృణాళిని, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దాసరి వెంకట రమణ, కథల తాతయ్య చొక్కాపు వెంకటరమణ, నేషనల్ బుక్ ట్రస్ట్ కన్వీనర్ మోహన్,మాచిరాజు సాహిత్య కళా పీఠం అధ్యక్షులు కామేశ్వరరావు, చేతుల మీదుగా అభిలాష్ కు నగదు బహుమతిని జ్ఞాపికను ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పాఠశాల విద్యార్థిని ప్రోత్సహించిన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మను కూడా శాలువాతో సన్మానించారు. విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి ప్రత్యేకంగా అభినందించారు. జాతీయస్థాయి కథల పోటీలలో బహుమతిని అందుకున్న అభిలాష్ ను ప్రోత్సహించిన తెలుగు పండితులు ప్రవీణ్ శర్మను పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణా చారి,పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.

More articles

Latest article