27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

చౌకబారు ప్రకటనలు మానుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల అసలైన ఐకాస రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్
  • ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్

బతుకమ్మ, నిజామాబాద్ : చౌకబారు ప్రకటనలు మానుకోవాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐకాస రాష్ట్ర చైర్మన్ హారం జగదీశ్వర్ అని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్అన్నారు. నగరంలోని టీఎన్జీవో కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షం వల్ల నిరాశ్రయులైన వరద బాధితుల కోసం ఆపన్న హస్తం అందించడానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ లు ఒకరోజు మూలవేతనాన్ని దాదాపు 130 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారన్నారు. బోగస్ జేఏసీ నేతగా, బాధ్యుడిగా తాను ఇప్పించినట్లు ప్రకటన చేయడం సత్యదూరం అని అన్నారు. చౌకబారు ప్రకటనలు చేయడం మానుకోవాలి అన్నారు. అజ్ఞాత వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉద్యమం అంటే పత్రిక, ప్రకటనలు కాదని క్షేత్రస్థాయిలో పోరాటం చేయడమే ఉద్యమానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్, టీఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి, కేంద్ర బాధ్యులు ఎం.సతీష్, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు జాకీర్ హుస్సేన్ ఉమా కిరణ్ పందిరి స్వామి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article