33.9 C
Hyderabad

అధికారులు నిద్ర మత్తు వీడి తగిన చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీజీవీపీ నాయకులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

డీఈఓ, ఎంఈఓ అధికారులు నిద్ర మత్తు వీడి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న యాజమాన్యంపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీజీవీపీ డిమాండ్ చేసింది. నారాయణ విద్యాసంస్థల పేరుతో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అడ్మిషన్లను బుధవారం తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) అడ్డుకుంది. సంబంధిత విద్యాసంస్థలకు ప్రభుత్వ అనుమతులు లేవని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు స్పష్టం చేసినప్పటికీ, యాజమాన్యం తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తూ అడ్మిషన్లు కొనసాగించడం మోసపూరిత చర్యగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు అక్కడికి చేరుకుని అడ్మిషన్ ఫారమ్స్ స్వాధీనం చేసుకొని, అడ్మిషన్ల ప్రక్రియను అడ్డుకున్నారు. వెంటనే 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 

Authorities should wake up and take appropriate action.

More articles

Latest article