27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

లారీ నుంచి బియ్యం బస్తాల చోరికి యత్నం

Must read

📰 Generate e-Paper Clip

. . . రెండు ఆటోలను పట్టుకున్న స్థానికులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర శివారులోని ఖానాపూర్ లో గల ఏఎన్ఆర్ గోదాం వద్ద లారీలో నుంచి బియ్యం బస్తాల దొంగతనం యత్నం జరిగిందని నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వో శ్రీనివాస్ తెలిపారు. స్థానికంగా గోదాముల వద్ద నిలిచి ఉంచిన ఏపీ 15 వై 2522 లారీ నుంచి టీఎస్ 16 యూసి 0568 , టీఎస్ 16 యూసీ 1595 ఆటోలలో బియ్యాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. గోదాము వద్ద ఓ వ్యక్తి చూసి అరవడంతో రఫిక్, అబు బాకర్, ఫిరోజ్ లు ఆటోలను వదిలి పరారీ అయ్యారు. లారీ ఓనర్ శివలింగ ప్రసాద్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపైన కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
. . . ఇంటి దొంగల పనేనా?
నిజామాబాద్ నగరంలో రైసుమిల్లుల వద్ద, గోదాముల వద్ద బియ్యం దొంగతనం అన్నది రోజు జరిగే తంతుగా మారింది. కొన్ని సంఘటనల్లో సంబంధిత యజమానులే బియ్యాన్ని దొంగిలించి ఆ నేపాన్ని ఇతరుల పైకి తోసివేశారన్న అపవాదు ఉంది. గతంలో జిల్లా కేంద్రంలోని పలు రైసుమిల్లులతో పాటు గోదాముల వద్ద బియ్యం లారీలకు లారీలే చోరికి గురయ్యాయి. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం గోదాముల వద్ద సీఎంఆర్ రైసు ఉన్న లారీ చోరికి గురైంది. లారీకి జీపీఎస్ డివైజ్ ఉండడంతో వర్ని పోలీస్ స్టేసన్ పరిధిలో పట్టుబడింది. అదే మాదిరిగానే ఖానాపూర్ లో పేరు మోసిన గోదాములో ప్రతియేడాది బియ్యం దొంగతనం లేదా పక్కదారి పట్టించడమన్నది రెగ్యులర్ జరిగే పని అనే విమర్శలు లేకపోలేదు. కొందరు గుమాస్తాలు, హమాలీలు కలిసి బియ్యాన్ని తస్కరించిన ఘటనలున్నాయి. అదే విధంగా కొందరు మిల్లర్లు సీఎంఆర్ ను అప్పగించేందుకు చోరి బియ్యాన్ని కొనుగోలు చేస్తారనే ఆరోపణలు కూడా లేకపోలేదు.

More articles

Latest article