29.7 C
Hyderabad

గ్రామపంచాయతీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం కలకలం!

Attempted suicide by a Gram Panchayat worker... causes a stir!

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  అప్రమత్తమైన అధికారులు

 

రాజంపేట్, బతుకమ్మ :

 

గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేగింది. రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డిపల్లి తండా గ్రామంలో గ్రామపంచాయతీ వర్కర్ గా పనిచేస్తున్న బాల్య (48)సోమవారం రాత్రి సమయంలో జీతాలు సకాలంలో అందకపోవడం, విధి నిర్వహణలో అధికారుల వేధింపులు, ఓ అధికారి నిర్లక్ష్యమే తన మనస్తాపానికి కారణమని ఆరోపిస్తూ పంచాయతీ ఉద్యోగి బాల్య ఈ అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా తాను పనిచేస్తున్న గ్రామ పరిధిలోని మూడు వాటర్ ట్యాంకుల్లో పురుగుమందు కలిపినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై సోమవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో గ్రామపంచాయతీ వర్కర్లు కామారెడ్డి ఏరియా ఆసుపత్రిక తరలించి చికిత్స అందజేశారు వెంటనే గ్రామపంచాయతీ పరిధిలోని మూడు వాటర్ ట్యాంకులలో నీరును తొలగించి గ్రామస్తులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో జిల్లా మండల అధికారులు హుటాహుటిన స్పందించారు. మరోవైపు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాల్యను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు సకాలంలో అందకపోవడం, అధికారుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, వేధింపులపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు ఈ ఘటన చర్చకు దారితీసింది. అయితే మూడు వాటర్ ట్యాంకుల్లో పురుగుమందు కలిపిన అంశంపై అధికారులు నీటి నమూనాలను పరీక్షించి తాగునీటి భద్రతపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్మికుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులెవరైనా ఉంటే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులను వివరణ కోరగా స్పందించలేదు. ఇంత జరిగిన విషయాన్ని మీడియాకు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

More articles

Latest article