27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నగరంలో పట్టపగలు చోరీకి యత్నం

Must read

📰 Generate e-Paper Clip

పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఓ యువకుడు పట్టపగలే చోరీకి యత్నించాడు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం నగరంలోని బోధన్ రోడ్ లో గల సీఎం రోడ్ గల్లీలో జరిగింది. స్థానికంగా మదర్సా మజారుల్ పొలం ప్రాంతంలోని వాజిద్ ఖాన్ ఇంటిలో చోరీయత్నం జరిగింది. నగరంలోని డైరీ ఫార్మ్ కు చెందిన నసీర్ అనే యువకుడు పట్టపగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. బంగారు నగలను దొంగిలించేందుకు బీరువాను ధ్వంసం చేశాడు. స్కూల్ పిల్లల కోసం బయటకు వెళ్లిన యజమాని షారుక్ పిల్లలతో సహా తిరిగి వచ్చాడు. అతడిని చూసిన నసీర్ కత్తితో అతని బెదిరించి పారిపోయేందుకు యత్నించాడు. దానితో అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకుని దేహ శుద్ధి చేశారు. అతడిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.

More articles

Latest article