28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

దొంగ ఓటు ప్రయత్నం.. ఇద్దరిపై కేసు

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ : 

 

బోధన్ నగరంలో  జరుగుతున్న ఎన్నికల సందర్భంగా దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించిన ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాకాసిపేట్‌లోని బూత్ నం.24 మరియు గోశాల ఏరియాలోని బూత్ నం.78 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇతరుల పేర్లతో, తప్పుడు గుర్తింపు పత్రాలతో ఓటు వేయడానికి ప్రయత్నించినట్లు ఎన్నికల సిబ్బంది గుర్తించారు. అనుమానం రావడంతో వారిని నిలిపివేసి విచారించగా దొంగ ఓటు వేయడానికి వచ్చినట్లు తేలింది.దీంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు సంబంధిత చట్టాల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతరుల పేర్లతో ఓటు వేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ హెచ్చరించారు.

 

More articles

Latest article