దొంగ ఓటు ప్రయత్నం.. ఇద్దరిపై కేసు
బోధన్, బతుకమ్మ : బోధన్ నగరంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించిన ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాకాసిపేట్‌లోని బూత్ నం.24 మరియు గోశాల ఏరియాలోని బూత్ నం.78 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇతరుల పేర్లతో, తప్పుడు గుర్తింపు పత్రాలతో ఓటు వేయడానికి ప్రయత్నించినట్లు ఎన్నికల సిబ్బంది గుర్తించారు. అనుమానం రావడంతో వారిని నిలిపివేసి విచారించగా దొంగ ఓటు వేయడానికి...