. . . ఘనంగా వాజ్ పేయి శత జయంతి వేడుకలు
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
దివంగత ప్రధాని అటల్ బీహరి వాజ్ పేయి శత జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పార్టి జిల్లా కార్యాలయంలో వాజ్ పెయి పోటోకు పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సంధర్బంగా ప్రగతి నగర్ లో బిజేపి ఓబిసి మోర్చ అధ్వర్యంలో స్వచ్చ భారత్ కార్యక్రమం నిర్వహించారు. గౌతంనగర్ లోని స్నేహ సోసైటిలో విద్యార్ధులకు పండ్ల పంపిణి చేశారు.

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అటల్ బిహారి వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గోని మాట్లాడుతు…భారతరత్న ,స్వతంత్ర సమరయోధులు, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్వక్తి అటల్ జీ అని జాతీయ పునరనిర్మాణం కోసం దేశభక్తి పెంపొందించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లొ క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి అని కోనియాడారు.రాజకీయంగా ప్రజల్లో చైతన్యం కోసం దేశ అభివృద్దే లక్షంగా ప్రజా సేవే మార్గంగా ఏర్పాటు చేసిన జన్ సంఘ పార్టీ అధ్యక్షులుగా,తరువాత భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పార్టీ అధ్యక్షులుగా పని చేసి,రెండు ఎంపీ స్థానాలకె పరిమితం ఉన్న పార్టీని ప్రభుత్వం స్వాతహాగా ఏర్పాటు చేసేలాగా కృషి చేసిన గొప్ప రాజనీతి పరుడు అటల్ జీ అని కొనియాడారు.3 సార్లు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సూపరిపాలన అందించి చరిత్రలో ఎక్కిన నాయకుడు, రాజకీయ భీష్మ పితామహుడు అటల్ జీ అన్నారు.

రాజకీయ పార్టీలకు అతితంగా అందరు మెచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయినాయకత్వంలో భారతదేశంలో విద్య, వైద్యం మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేసారని అన్నారు.ఆర్ధిక వ్యవస్థ పటిష్టకు ఆనాడు వేసిన పునాది నేడు ఐదవ స్థానంలో భారత్ నిలిచిందని,విదేశాంగా విధానంతో సహా అన్ని రంగాలలో గణనియమైన సంస్కరణలు చూసిందన్నారు .పోక్రాన్ -2 అనుపరీక్ష, లాహోర్ డిక్లరేషన్ వంటి దౌత్య కార్యక్రమాల ద్వారా శాంతిని పెంపొందించడం జరిగిందన్నారు. అటల్ జీ సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన జన్మదినం సందర్బంగా సూపరిపాలన దినంగా మనం అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు,దింతో ప్రభుత్వం జవాబుతారి తనంతో వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
