27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కనీసం మూడు డిఏలను విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

పీ ఆర్టియు తెలంగాణ నిజాంబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు  కృపాల్ సింగ్

ఆర్మూర్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ లో ఉన్న ఐదు డీఏల నుంచి కనీసం మూడు డీఏలు విడుదల చేయాలని పీ ఆర్టియు తెలంగాణ నిజాంబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు  కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు.  మొక్కుబడిగా ఒక డి ఏ ఇస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ చాలా అసంతృప్తితో నిరసనలు తెలపడానికి సిద్ధమవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని పున సమీక్షించుకొని కనీసం మూడు డి ఏ లను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  దీనికి సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంతృప్తికర నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పీ ఆర్టియు తెలంగాణ నిజాంబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు కృపాల్ సింగ్ గారు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More articles

Latest article