29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

Must read

📰 Generate e-Paper Clip

  • కోర్టు కానిస్టేబుల్ ద్వార లంచం తీసుకుంటు..
  • ఉమ్మడి జిల్లా చరిత్రలో తొలిసారి అవినీతి నిరోధక శాఖకు చిక్కిన వైనం

 

 కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ అశోక్ శివరాం నాయక్ ఏసీబీకి చిక్కారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో కోర్టు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సంజయ్ ద్వారా రూ.10వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిజామాబాద్ రెంజ్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణ పోలీస్స్టేషన్లో  2018లో నమోదైన చీటింగ్ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసును త్వరగా ముగించడానికి ఏపీపీ గుగ్లోత్ అశోక్ శివరాం బాధితునికి రూ.15వేల లంచం డిమాండ్ చేశాడు. చివరికి రూ.10వేలకు ఒప్పందం చేసుకున్నాడు. కామారెడ్డి పట్టణ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కోర్టు కానిస్టేబుల్ సంజయ్ ద్వారా శుక్రవారం బాధితుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సుమారు ఐదు గంటలుగా కేసు విచారణ కొనసాగుతోంది. ఏపీపీ ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం ఏపీపీ, కోర్టు కానిస్టేబుళ్లను అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో శనివారం హాజరుపరుస్తామని పేర్కొన్నారు.  నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో న్యాయ శాఖ నుంచి ఉద్యోగులు ఎవ్వరు ఇప్పటి వరకు ఎసిబికి చిక్కలేదు. కామారెడ్డి లో ఏకంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏసీబీకి చిక్కడంతో న్యాయశాఖలో అవినీతి  వేళ్లూనుకుందని స్పష్టం అవుతుంది. న్యాయ శాఖకు అవినీతి మరకలతో సామాన్యులకు న్యాయం పై సంశయాలు వ్యక్తం అవుతున్నాయి.

More articles

Latest article