భిక్కనూరులో అసైన్ భూధందా

0 11,251

 

. . . ఎమ్ఎస్ఎన్ ఫార్మా కబ్జాలో 564 సర్వే నెంబర్లు

 

. . . అధికారుల నిర్లక్ష్యమా ?

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్ భూములపై కార్పొరేట్ కంపెనీ కన్ను పడింది. భిక్కనూరు మండల కేంద్రంలో ఎమ్ఎస్ఎన్ ఫార్మా కంపెనీ 564 సర్వే నెంబర్ పరిధిలో సుమారు 60 నుంచి 70 ఎకరాలు అసైన్ భూమి అక్రమంగా రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

. . . కబ్జాల వైఖరి

ఎమ్ఎస్ఎన్ ఫార్మా కంపెనీ వ్యూహాత్మకంగా అసైన్ భూములనే టార్గెట్ చేసింది. మాయమాటలు చెప్పి తక్కువ ధరలకు భూములను లాగేసుకుంటున్నారు. అమ్మకం చట్ట విరుద్ధమని తెలిసి కూడా కంపెనీ వెనకాడ లేదు. 564 సర్వే నెంబర్ లోని భూమికి ప్రస్తుతం కంపెనీ కాంపౌండ్ వాల్ వేసి ఆక్రమించింది. కొన్నిచోట్ల షెడ్లు, సిసి రోడ్లు కూడా వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రౌండ్ లో కంపెనీ సెక్యూరిటీ తో కాకుండా ప్రైవేట్ వ్యక్తులతో కాపలా కాపిస్తున్నారు.

. . . అధికారుల నిర్లక్ష్యం

ఆరు నెలలుగా ఫిర్యాదు చేస్తున్న ఎమ్మార్వో ఆఫీస్ నుంచి స్పందన లేదు. దస్త్రాల పరిశీలన పేరుతో కాలయాపన చేస్తున్నారు. 25 మంది రైతుల పేరు మీద ఉన్న పట్టాలు ఇప్పటికి రైతుల దగ్గరే ఉన్నాయి. కానీ భూమి మాత్రం కంపెనీ ఆధీనంలో ఉందంటే రిజిస్ట్రేషన్ లేకుండానే స్వాధీనం జరిగింది.

 

Assigned land scam in Bhikkanoor

 

. . . బాండ్ పేపర్ మీద భేరాసారాలు

ఒక ఎకరం మార్కెట్ విలువ 50 లక్షలు ఉంటే కంపెనీ కేవలం 5 లక్షల నుండి 10 లక్షలకె రైతులతో మాట్లాడుకుంది. కానీ అసైన్ భూమి అమ్మకం చెల్లదని తెలిసి కూడా సాదా బాండ్ల పేపర్ల పై రాయించుకుందని సమాచారం.

. . . స్థానిక నేతల ఒత్తిడి

ఈ భూ దందా వెనుక కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల హస్తముంది. వారి ఒత్తిడితోనే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అని స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

. . . కబ్జాల లోసూగులు

అసైన్ ల్యాండ్స్ పిఓటి యాక్ట్ 1977 ప్రకారం ఈ భూములను కొనుగోలు అమ్మకం నేరం, కొన్న ఆ భూమి ప్రభుత్వానికి చెందుతుంది. ఈ చట్టపు లొసుగులు కంపెనీకి తెలియవా ?

. . . కబ్జాల నిర్ధారణ

ప్రభుత్వ అధికారులను కూడా కంపెనీలోనికి రానీయకుండా అడ్డుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ భూ దందాపై స్పెషల్ విచారణకు ఆదేశిస్తారా ? ఆర్డిఓ స్థాయి అధికారులతో ఎంక్వయిరీ వేయిస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. అసైన్డ్ భూములు అమ్మిన రైతుపై కొన్న కంపెనీపై క్రిమినల్ కేసులు పెట్టాలి. భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన మరో పేదలకు ఇవ్వాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

. . . ఈ నెల 25 తరువాత సర్వే కు చర్యలు తీసుకుంటాం : తహసీల్దార్ సునీత

ఈనెల 25 వరకు ఎస్ ఐ ఆర్ కార్యక్రమం కొనసాగుతుండగా 25 అనంతరం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎమ్ఎస్ఎన్ ఫార్మా కంపెనీ లో ఆ సెండ్ భూముల ఆరోపణల్లో భాగంగా సర్వేకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సునీత తెలిపారు.

 

Assigned land scam in Bhikkanoor

Leave A Reply

Your email address will not be published.