25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడిపై ఆశ్రమానికి నిప్పు కేసు

Must read

📰 Generate e-Paper Clip

. . . మాజీ ఎంపీటీసీతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్  

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

 

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారులోని అవదూత నిర్మలానంద స్వామి ఆశ్రమానికి నిప్పంటించి దహనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోపాల్ బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు, సిర్పూర్ మాజీ సర్పంచ్ సామ ముత్యం రెడ్డితో పాటు నర్సింగ్ పల్లి మాజీ ఎంపీటీసీ సద్మాల రాములుతో పాటు ముదక్ పల్లికి చెందిన నారాయణరెడ్డిలతో పాటు మరో ఇద్దరిపై మోపాల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా అవధూత నిర్మలానంద స్వామికి 1985లో అప్పటి ప్రభుత్వం ఐదు ఎకరాల అసైన్డ్ భూమిని కేటాయించింది. సంబంధిత భూమిని నిర్మలానంద స్వామి కొంత మంది రైతులకు కౌలుకు ఇవ్వగా వారిని బెదిరించి కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ చొరవతో కబ్జాదారుల చెర నుంచి భూమిని విడిపించారు. ఇటీవల అక్కడ ఆశ్రమం నిర్మించి సత్సంగం నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న అర్ధరాత్రి ఆశ్రమానికి నిప్పంటించి దహనం చేశారు. అయితే సంబంధిత భూమిని కబ్జా చేసిన బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు, సిర్పూర్ మాజీ సర్పంచ్ సామ ముత్యంరెడ్డి ఆయన కుమారుడు, నర్సింగ్ పల్లి మాజీ సర్పంచ్ రాములు, ముదక్ పల్లికి చెందిన నారాయణరెడ్డిలపై అవదూత నిర్మలానందస్వామి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

. . . గతంలోనే కేసు నమోదు చేస్తే ఆశ్రమం దహనం కాకుండా మిగిలేదా? 

అవదూత నిర్మలానందస్వామికి ప్రభుత్వం కేటాయించిన భూమిని కబ్జా విషయంలో ఐదు సంవత్సరాలుగా అప్పటి అధికార బీఆర్ఎస్ నాయకులు అక్కడ దౌర్జన్యాలకు పాల్పడ్డారు. గత ఐదు సంవత్సరాలుగా స్వామిని భూమిలోకి రానివ్వకుండా వేదింపులకు పాల్పడ్డారు. గతేడాది సంబంధిత భూమిలో రెవెన్యూ అధికారులు సర్వే చేసినప్పుడు హద్దుల కోసం పెద్ద మనుషుల సమక్షంలో సిమెంట్ పోల్స్ లను ఏర్పాటు చేశారు. కానీ రాత్రికి రాత్రే వాటిని ఎత్తుకెళ్లారు. ఈ విషయంలో అవదూత నిర్మలానందస్వామి కబ్జాదారులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై సంబంధిత కేసును విచారణ చేసి సిమెంట్ స్తంబాలను కబ్జాదారులు ఎత్తుకెళ్లిన విషయం వాస్తవమేనని అయితే సర్వేయర్ ద్వారా సర్వే చేయించి సంబంధిత సిమెంట్ పోల్స్ మీ భూమిలోనే ఉంటే కేసు నమోదు చేసి పోల్స్ రికవరి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రెవన్యూ అధికారులకు హద్దులు చూయించాలని ఎస్సై లేఖ రాశారు. కానీ తర్వాత కాలంలో ఎస్సై బదిలీ కావడంతో ఆనాటి ఫిర్యాదును పోలీసులు అటకెక్కించారు. అదే విషయంపై ఏప్రిల్ మాసంలో అవదూత నిర్మలానందస్వామి మరోసారి మోపాల్ పోలీసులకు ప్రభుత్వాధికారులు తనకు ఇటీవలే ఇచ్చిన సర్వే, పంచానామ రిపోర్టును అందజేసినప్పటికీ బాధ్యులపై చర్యలపై తీసుకోవాలని పోలీసు కమిషనర్ తో పాటు ఏసీపీకి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఈ కేసును పట్టించుకోకపోవడంతో తమనేమి చేయలేరనే ధీమాతోనే ఆశ్రమానికి నిప్పుపెట్టారని చర్చ జరుగుతుంది.

Ashram arson case against former BRS mandal president

More articles

Latest article