26.2 C
Hyderabad
Monday, August 3, 2026

లివర్ క్యాన్సర్ నివారణ అంశంలో అశోక్ కు పేటెంట్ హక్కులు

Must read

📰 Generate e-Paper Clip

 

 కమ్మర్ పల్లి , బతుకమ్మ :

కమ్మరపల్లి మండలం లో హాస కొత్తూరు గ్రామానికి చెందిన బాస అశోక్ కు లివర్ క్యాన్సర్ నివారణకు రూపొందించిన నానో కంపోసిట్ ల పై రెండు దేశాలలో పేటెంట్ హక్కులు లభించాయి. గతంలో థాయిలాండ్ దేశం లో పేటెంట్ హక్కులు పొందిన అశోక్ ను తాజాగా మన భారత దేశం లోను పేటెంట్ హక్కులు పొందడం తో ఉస్మానియా యూనివర్సిటీ లో వివిధ విభాగాల అధిపతులు ప్రొఫెసర్లు ఆయన ను సన్మానించి అభినందించారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ నూతన పరిశోధనలు అంటే అమిత ఆసక్తి. ఉస్మానియా యూనివర్సిటీ లో ఎమ్మెస్ ఫిజిక్స్ చేసిన అక్కడే పి హెచ్ డి చేసారు .ప్రేపరషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ సమ్ పాలిమర్ గ్రీన్ కాంపోసైట్ యూసింగ్ బయో ఫీలర్స్ అనే అంశం లో గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. దేశం లో కాలేయ క్యాన్సర్ ఎక్కువ ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో దాన్ని నివారించడానికి అశోక్ నానో కాంపోసిట్ టర్మరిక్ పౌడర్ విత్ ఇన్ ఎస్ ఐ టీ యూ జనరేటెడ్ మెటల్ నానోపార్టికల్స్ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం  లేబరేటరీ సెల్ లైన్ స్టడీస్ ఇండికేటడ్ ఇట్స్ ఏ ఫిసైన్సీ ఇన్ ఇంచి బిటింగ్ మరియు అపోపీతోసిస్ ఆఫ్  హేపీజీ 2 కాన్సర్ సెల్స్ అని, లివర్ క్యాన్సర్ ని నివారించడానికి ఎంతో ఉపయోగం పడుతుందని బాస అశోక్ తెలిపారు. ఈ అంశం విషయంలో ఇప్పటికే థాయిలాండ్ దేశం లో పేటెంట్ పొందిన అశోక్ మన దేశం లో  కూడా పేటెంట్ పొందారు. రెండు దేశాల్లో పేటెంట్ హక్కులు పొందడంతో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ లు సిబ్బంది అశోక్ ను ఘనంగా సన్మానించారు. గడిచిన వంద సంవత్సరాలలో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ లో ఎవరికీ పేటెంట్ హక్కులు పొందలేదు.చిన్ననాటి నుండి చదువు అంటే ఆసక్తి చూపిన అశోక్ హాస కొత్తూరు ఉన్నత పాఠశాలలో పిల్లలకు విద్యా వాలంటీర్ గా ఫిజిక్స్ పాఠాలు చెప్పారు. ఉన్నత చదువులు చదివిన అశోక్ వివిధ అంశాలలో రాసిన ఆర్టికల్ లు అంతర్జాతీయ జర్నల్ లలో ప్రచురణకు ఎంపికయ్యాయి. ఎందరో ఉన్నత విద్యావంతులు ఉన్నత శ్రేణి అధికారులు ఉన్న ఈ గ్రామంలో జన్మించిన బాస అశోక్ అదే స్థాయిలో పరిశోధనలు చేస్తూ ప్రశంసలు పొందడం పట్ల గ్రామస్తులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.

Ashok gets patent rights in liver cancer prevention

More articles

Latest article