27.3 C
Hyderabad
Friday, July 31, 2026

పీడీఎస్ యూ నాయకుల అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

డిచ్ పల్లి, బతుకమ్మ: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్ యూ నాయకులు రవీందర్, అక్షయ్, రాకేశ్ ను డిచ్ పల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోవడంతో పలుచోట్ల ఫుడ్ పాయిజన్ అయ్యిందన్నారు. ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, యూనివర్సిటీలకు అందాల్సిన స్పెషల్ గ్రాంట్స్ ను విడుదల చేయడం లేదని విమర్శించారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, యూనివర్సిటీ విద్యార్థులకు నెలకు రూ.2వేల ఫెలోషిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ  పీడీఎస్ యూ నాయకుల అరెస్టును  జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ఖండించారు.

More articles

Latest article