పీడీఎస్ యూ నాయకుల అరెస్టు
డిచ్ పల్లి, బతుకమ్మ: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్ యూ నాయకులు రవీందర్, అక్షయ్, రాకేశ్ ను డిచ్ పల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోవడంతో పలుచోట్ల ఫుడ్ పాయిజన్ అయ్యిందన్నారు. ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, యూనివర్సిటీలకు అందాల్సిన స్పెషల్ గ్రాంట్స్ ను విడుదల చేయడం లేదని విమర్శించారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను వెంటనే...