29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మాజీ సర్పంచుల అరెస్ట్ అప్రజాస్వామికం

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి!
  • అధికారం రాగానే ఇచ్చిన మాట మర్చిపోయిన రేవంత్ రెడ్డి!
  • బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్
  • బతుకమ్మ సిద్దిపేట : ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మాజీ సర్పంచులకు ఇచ్చిన మాటను మర్చిపోయి వారు చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లును ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా అడుగుదామని వస్తే అక్రమంగా అరెస్టు చేయించడం సరికాదని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు.సోమవారం నాడు చిన్నకోడూరులో ప్రెస్ నోట్ విడుదల చేసి వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి శుద్ధిని శుద్ధ పూసని అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని సర్పంచ్ల కాలంలో లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తే ఇంతవరకు కూడా పెండింగ్ బిల్లులను విడుదల చేయకపోవడం సరైనది కాదని మిత్తికి మిత్తి కట్టాల్సిన పరిస్థితి సర్పంచులకు దాపరించిందని ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి గోడు విన్నవించుకుందామంటే పోలీసుల చేత ఎక్కడికక్కడ అరెస్టు చేయడం సరైనది కాదని పెండింగ్లో ఉన్న డబ్బులను వెంటనే విడుదల చేయాలని లేకుంటే ప్రభుత్వానికి మనుగడ ఉండదని వారు హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, సొసైటీ చెర్మెన్ ములకల కనకరాజు, నాయకులు కొండం రవీందర్ రెడ్డి, పంపరి కనకయ్య, రాజశేఖర్ రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article