28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన వ్యక్తి కి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్సకు ఏర్పాట్లు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ముప్కాల్:ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామానికి చెందిన బాదనపల్లి సాయన్న బ్రతుకుతెరువు కోసం దోహఖత్తర్ వెళ్లాడు. అయితే కొంతకాలం క్రితం ఆయన తీవ్రమైన పెరాలసిస్ వ్యాధితో బాధపడి బ్రెయిన్ స్ట్రోక్ గురై అక్కడే హాస్పిటల్ లొ చికిత్స జరుగుతుండగానే స్వదేశానికి పంపడం జరిగింది. సాయన్న కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వీడియో చేసి పంపడంతో వారి అభ్యర్థనను గమనించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆయనకు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో బ్రెయిన్ స్ట్రోక్ , పెరాలసిస్ కు సంబంధించిన చికిత్సను ఆరోగ్యశ్రీలో జరిపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది.

More articles

Latest article