25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉమెన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఆరీఫ్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్‌గల్, బతుకమ్మ : ఆలిండియా ఉమెన్ రైట్స్ సోషల్ అండ్, జస్టిస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా భీమ్ గల్ కు చెందిన మొహ్మాద్ ఆరీఫ్ నియమితులయ్యారు.  ఈ మేరకు ఆల్ ఇండియా ఉమెన్  రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ శేఖ్ షాహీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరీఫ్ సామాజిక స్పృహ, సంఘ సేవ, నీతి, నిజాయితీని చూసి ఆయన సేవలను సంస్థకు వినియోగించుకొనేందుకే జిల్లా భాద్యత అప్పగించినట్లు తెలిపారు.ఈ మేరకు నియామక పత్రాన్ని శనివారం అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఉమెన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆరిఫ్ మాట్లాడుతూ. నాపై పూర్తి విశ్వాసంతో మండల స్థాయి వ్యక్తికి జిల్లా స్థాయి అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు ఉమెన్ రైట్స్ఆల్ ఇండియా ప్రెసిడెంట్ షాహిన్,ఉమెన్ రైట్స్ సభ్యులకు పూర్తి విశ్వాసంతో పనిచేసి వారి మనసుని గెలుచుకునే  స్థాయి నిలుస్తానని ఆరిఫ్ అన్నారు. అనంతరం నూతనంగా జిల్లా ఉమెన్ రైట్స్ అధ్యక్షుడు ఆరిఫ్ కు ఆలిండియా ఉమెన్ రైట్స్ ప్రెసిడెంట్ అలాగే సభ్యులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఉమెన్ రైట్స్ సభ్యులు మొహమ్మద్ పాషా, అయాన్ మాలిక్, ఫెరోస్, కౌసరి బేగం తదితరులు పాల్గొన్నారు…

More articles

Latest article