వెబ్ న్యూస్, బతుకమ్మ : లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు టీ స్టాల్ ను సోమవారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. రాజ్యసభ క్యాంటీన్‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. అరకు టీ స్టాల్ ఏర్పాటు కోసం స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్ సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.
