27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఏ ఐ పి ఎస్ యు ఆర్మూర్ డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్ :  అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (ఏ ఐ పి ఎస్ యు ) ఆర్మూర్ డివిజన్ నూతన కమిటీ పట్టణంలోని సివిఆర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్, బోడ అనిల్ మాట్లాడుతూ.విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఏ ఐ పి ఎస్ యు విద్యార్థి సంఘం నిరంతరం అలుపెరగని పోరాటాలు చేస్తుందని, ఆ పోరాటాలకు ఆకర్షితులై ఆర్మూర్ డివిజన్ కమిటీ కి సంబంధించి విద్యార్థి నాయకులు చేరారని తెలిపారు. భవిష్యత్తు కార్యచరణ దృష్టిలో ఉంచుకొని ఏ ఐ పి ఎస్ యు నూతన కమిటీ,  ఆర్మూర్ డివిజన్ కమిటీ మొత్తం 13 మందితో ఎన్నుకోవడం జరిగిందని వెల్లడించారు. ఆర్మూర్ డివిజన్ కార్యదర్శిగా గోపాల్ సింగ్ ఠాగూర్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులుగా విశ్లవత్ దినేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు.గత మూడు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని పళ్ళు సమస్యలపై భవిష్యత్తు కార్యచరణ రూపొందించుకొని రానున్న రోజుల్లో, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నూతన కమిటీ ఉద్యమిస్తుందని విద్యార్థుల మన్ననలు పొందుతూ,విద్య రంగ సమస్యల పరిష్కారంకై పోరాటాలు చేస్తూ వస్తుందని అన్నారు. ఆ పోరాటాలు అనేక మంది యువత, విద్యార్థులు ఏ ఐ పి ఎస్ యు విద్యార్థి సంఘాన్ని ఆదరిస్తూ అండగా నిలుస్తున్నారని అన్నారు. సంక్షేమ హాస్టల్లో, గురుకులాలకు పెంచిన మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను తక్షణమే అమలు చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తుందని దానికి సంబంధించి కూడా పాఠశాల మధ్యాహ్నం భోజన మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఎస్టీ కాలేజ్ హాస్టల్ ని తక్షణమే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సంక్షేమ హాస్టల్లకు పక్క భవనాలను నిర్మించాలని, ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న రోజుల్లో విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. స్కాలర్షిప్ కి సంబంధించి అసెంబ్లీ లో స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గొంతు ఎత్తాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్, శివ, సిద్దు, నిఖిల్, సంధ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article