నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు పాలక మండళ్లను నియమిస్తు దేవాదాయ ధర్మదాయ శాఖ ఉత్తర్వలు జారీ చేసింది. సంవత్సర కాలం పదవులలో ఉండేళ ధర్మకర్తల మండలిని నియమిస్తు మంగళవారం దేవదాయ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాలక మండళ్ళ నియమాకంలో పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నుడా చైర్మెన్ కేశ వేణులు సూచించిన వారికి పదవులు దక్కాయి అనే టాక్ నడుస్తుంది. పాలక మండళ్ల చైర్మెన్, డైరెక్టర్ పదవులు మాత్రం ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన జంప్ జిలానీలకు దక్కడంతో సీనియర్ కార్యకర్తలు అసంత్రుప్తితో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్న ఇప్పటికీ పార్టీ పదవులు పంపకాలు చేయలేదు. దశాబ్ధంకు పైగా అధికార పార్టీతో కొట్లాడిన కార్యకర్తలకు పైసా ఆదాయం వచ్చే దారి చూపలేదనే విమర్శలు ఉన్నాయి. త్వరలో బల్ధియా ఎన్నికలకు సిద్ధమౌతున్న వేళ పార్టీ నాయకులు అసలు సీసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగడంపై రగిలిపోతున్నారు. నగరంలోని ప్రముఖ దేవాలయం నీల కంఠేశ్వర ఆలయం, గోల్ హనుమాన్ దేవాలయాలకు పాలక మండళ్లను నియమించలేదు. నగర శివారులోని మాదవ నగర్ సాయి బాబా మందిరానికి కూడా ధర్మకర్తల మండలి నియామకం ఉత్తర్వులు త్వరలో వస్తాయని అంటున్నారు.
శంభూని గుడి ఆలయ కమిటి చైర్మెన్ గా పూసల మధు..
నిజామాబాద్ నగరంలోని స్వయం భూదేవాలయం శ్రీ శంభూలింగేశ్వర ఆలయకమిటీ చైర్మెన్ గా పూసల మధు ఆలియాస్ బింగిమధును నియమించగా డైరెక్టర్ లుగా గాజుల కిషోర్, గాండ్ల సంతోష్ కుమార్, కమల్ కిషోర్ దయామా, మామీడి శేఖర్, ఉప్పల రమేష్, గోపు రేఖ అలియాస్ ఎర్రం రేఖలను నియమించారు.

- జండా బాలాజీ పాలక మండలి చైర్మెన్ గా లవంగ ప్రమోద్..
నిజామాబాద్ నగరంలోని జండాగల్లిలో గల జండా బాలాజీ ఆలయ కమిటీ చైర్మెన్ గా లవంగ ప్రమోద్ ను నియమించారు. ధర్మకర్తలుగా పోలకొండ నర్సింగ్ రావు, సిరిపురం కిరణ్ కుమార్, వేముల దేవిదాస్, మంత లక్ష్మన్, పవార్ విజయ, కోర్వ రాజ్ కుమార్ లను ఎంపిక చేశారు.

- సంతోషీమాత, సాయి బాబా ఆలయ కమిటి చైర్మెన్ గా బోదుకం గంగా కిషన్..
నగరంలోని హమాల్ వాడిలో గల సంతోషీమాత, సాయి బాబా ఆలయ కమిటీ చైర్మెన్ గా బోదుకం గంగా కిషన్ ను నియమించారు. డైరెక్టర్ లుగా శ్రీ రాం శ్రీనివాస్, గాదే ప్రవీణ్ కుమార్, బాణాల శివ లింగం, శాంతాబాయి నియమితులయ్యారు.

