నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం షాపులు (ఎ4) లైసెన్స్ ల జారీ కోసం ఒపెన్ టెండర్లను (దరఖాస్తులను) ఆహ్వానిస్తున్నట్టు నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ ఈఎస్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో 36, ఆర్మూర్ లో 25, బొధన్ లో 18, బీంగల్ లో 12, మోర్తాడ్ లో 11 మద్యం షాపులు ఉన్నాయన్నారు. అందులో 11 ఎస్సీలకు, గౌడ కులస్థులకు 11, 2 ఎస్టీలకు కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రూ.3 లక్షలు (తిరిగి చెల్లించనక్కర్లేని) డిడిల ద్వార మద్యం దుకాణాల నిర్వహణను దక్కించుకునే ఒపెన్ టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన షాపులకు కేవలం ఆయా సామాజిక వర్గాల వారికే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని తెలిపారు. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 23న జిల్లా కేంద్రానికి శివారులోని మాధవ నగర్ వద్ధ గల భారతీ గార్డేన్ లో జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డి ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వార మద్యం దుకాణాలకు లైసెన్స్ల కేటాయింపు జరగుతుందని తెలిపారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అక్టోబర్ 18న సాయంత్రం 5 గంటల వరకు ఉన్న వారి ధరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. 2023-25 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ మద్యం దుకాణాల కోసం ఒపెన్ టెండర్లను ఆహ్వానించగా 102 దుకాణాల కోసం 3759 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆనాడు ఒపెన్ టెండర్ ఫారం ధర రూ.2 లక్షలు ఉండగా ప్రభుత్వానికి రూ.76 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈసారి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. మద్యం దుకాణాల కోసం టెండర్లలో పాల్గొనేవారికి ఎలాంటి సందేహాలు ఉన్నా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మద్యం దుకాణాల కేటాయింపు అంతా ఓపేన్ పద్ధతిలో జరుగుతందని, దళారుల ప్రమేయం ఉండదని దానిని ప్రజలు గమనించాలని తెలిపారు. మద్యం దుకాణాలలో లైసెన్స్ ల కోసం ఒపెన్ టెండర్లలో తెలంగాణ వాసులకు అవకాశం అని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎస్ హెచ్ ఓ స్వప్న, గుండప్ప, భాస్కర్ రావు, మల్లెష్ తదితరులు పాల్గొన్నారు.
