జిల్లాలో 102 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం షాపులు (ఎ4)   లైసెన్స్ ల జారీ కోసం ఒపెన్ టెండర్లను (దరఖాస్తులను) ఆహ్వానిస్తున్నట్టు నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ ఈఎస్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..  నిజామాబాద్ జిల్లాలో 36, ఆర్మూర్ లో 25, బొధన్ లో 18, బీంగల్ లో 12, మోర్తాడ్ లో 11 మద్యం షాపులు ఉన్నాయన్నారు. అందులో  11 ఎస్సీలకు, గౌడ...