బతుకమ్మ జుక్కల్: జుక్కల్ ఎమ్మార్వో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ నిర్వహిస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణలో ఒక దరఖాస్తు కూడా రాలేదని ఎమ్మార్వో హిమబిందు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నాతమ దృష్టికి తీసుకువచ్చి దరఖాస్తు చేసుకుంటే సమస్యలు పరిష్కరిస్తామని ఆమె అన్నారు.