24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మైనారిటీ సెల్ జిల్లా, నగర చైర్మన్ పదవులకు దరఖాస్తుల స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనారిటీ సెల్ జిల్లా అబ్జర్వర్ మొహమ్మెద్ మోయిన్ ఆధ్వర్యంలో మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్, నగర చైర్మన్ పదవుల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తు ఫారాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారినే జిల్లా, నగర చైర్మన్ పదవులకు ఎంపిక చేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయని, వాటిలో సమర్థులైన నాయకులను గుర్తించి బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విపుల్ గౌడ్, కార్పొరేటర్ మనోహర్, నయీమ్, ఒబేద్, నవాజ్, అసద్, హర్షద్, ఖయ్యుమ్, జాఫర్, అద్నాన్ తదితరులు పాల్గొన్నారు.

 

Applications are being accepted for the posts of Minority Cell District and City Chairman.

More articles

Latest article