24.8 C
Hyderabad
Friday, July 31, 2026

చదువే కాకుండా విద్యార్థులకు  క్రిడలు సంస్కృతి నేర్పడమే ఏకైక లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

. . .  కాకతీయలో క్రిడోత్సవ్ వేడుకల ముగింపు

. . .  విద్యార్థులకు బహుమతులు అందచేసిన డైరెక్టర్ రామోజీరావు

. . . కాకతీయలో సంక్రాంతి వేడుకలు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

విద్యార్ధులకు చదువు ఓక్కటే కాకుండా క్రిడలతో పాటు మన సంస్కృతి సంప్రాదాయాలను నేర్పడమే తమ లక్ష్యమని విద్యార్ధులు కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రామోజీ రావు అన్నారు. నగరంలోని కాకతీయ విద్యాసంస్థలు ప్రగతి – నగర్, సుభాష్ నగర్ (క్యాంపస్) లలో గత మూడు రోజులుగా జరుగుతున్న క్రీడోత్సవ్ పోటీలు బహుమతుల ప్రధానోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఈ పోటీలలో భాగంగా శుక్రవారం  వివిధ ఆటల పోటిలలో గెలిచిన పలు విభాగాలకు చెందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ స్థానాలకు ట్రోఫీని, విద్యార్థులకు మెడళ్లను  ముఖ్య అథితిగా పాల్గోని కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ సిహెచ్ రామోజిరావు అందించారు.

Apart from studying, the only aim is to teach sports culture to the students ఈ సంధర్బంగా రామోజీరావు మాట్లాడుతూ…. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ పోటీలలో విద్యార్థులుతా చాలా ఉత్సాహంగా పాల్గొని, చక్కని ప్రదర్శన కనబరిచారని తెలుపుతూ – విజేతలకు ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ఇంకా ముందుముందు మరెన్నో విజయాలను సాధించి విద్యాసంస్థకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ముగింపు కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం “సంక్రాంతి సంబరాలు” పేరుతో వేడుకలను నిర్వహించారు. ఇందులో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పతంగుల పోటీలను నిర్వహించారు. ఆటపాటలతో ఎంతో సంతోషంగా కార్యక్రమాలను ముగించారు. ఈ వేడుకలలో విద్యా సంస్థల డైరెక్టర్ రామోజీ రావు, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ దిగంబర్, ఉపాధ్యాయబృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Apart from studying, the only aim is to teach sports culture to the students

More articles

Latest article