24 C
Hyderabad
Sunday, August 2, 2026

నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించిన అంతిరెడ్డి రాజారెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యములో నూతన ప్రభుత్వ మండల శాఖ గ్రంథాలయంను గ్రామాభివృద్ధి కమిటీ హాల్ క్రింద రూమ్ లో జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ప్రారంభించారు. గ్రామంలో ఉన్న యువతి యువకులకు,నిరుద్యోగుల విజ్ఞానం పెంపొంది ప్రభుత్వ ఉద్యోగుల పరీక్షల కోసం అన్ని రకాలుగా బుక్స్, న్యూస్ పేపర్స్, ఫర్నీచర్లు,చైర్ లతోపాటు అన్ని వసతులు ప్రభుత్వ జిల్లా గ్రంథాలయం తరపున కల్పిస్తామని, మండల గ్రామ స్థాయి యూత్ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని అంతిరెడ్డి రాజారెడ్డి కోరారు. గ్రంథాలయాన్ని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో  ఏర్పాటు చేసినందుకు,ముత్యాల సునీల్ కుమార్ కు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు,తెలిపారు.ఏర్గట్ల మండల కేంద్రానికి  గ్రంథాలయాన్ని మంజూరు చేసి ప్రారంభోత్సవానికి వచ్చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజారెడ్డి నీ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శాలువతో ఘనముగా సన్మానించారు.ఇట్టి కార్యక్రమములో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కారుపాకల నరసయ్య, గ్రామ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, మాజీ జెడ్ పిటిసి గుల్లే రాజేశ్వర్,మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు,మండల పార్టీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, గ్రామ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి,గడ్డం జీవన్ రెడ్డి, మూస్కుమోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి,కూరాకుల బోర్రన్న, రోక్కెడ చిన్న సాయిలు, పన్నాల నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article