23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మే డే ను పురస్కరించుకొని గురువారం మోర్తాడ్ మండల కేంద్రంలో నాయకులు, కార్మికులు జెండాను ఎగరావేసి మేడే కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు జి. కిషన్ మాట్లాడుతు కార్మిక హక్కుల కోసం ,కార్మికుల పని గంటల  తగ్గుదల కోసం, కార్మిక వేతనాల పెంపు కోసం, సరైన పనికి సరైన వేతనం సాగిన పోరాటంలో చిందిన ఎర్రనీ రక్తమే ఈ ఎర్రజెండా అని గుర్తు చేశారు. ఎన్నో వందల సంవత్సరాలు పోరాడి కొట్లాడీ తెచ్చుకున్న ఈ హక్కులను మనం కాపాడుకోవాలి పిలుపునిచ్చారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాల రాస్తున్నది ,కార్మిక చట్టాలను  ఆధాని, అంబానీ, బడాబడా వ్యాపారవేత్తల వద్ద  నరేంద్ర మోడీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని అన్నారు. కార్యక్రమంలో కిషన్, దశరత్, డాక్టర్ శ్రీను, గజానంద్, నాగలక్ష్మి, గంగు, రాజు, భాజన్న, సురేందర్, రవి, ముత్తేన్న, నర్సయ్య, గంగాధర్, గంగారాం, రాజేశ్వర్, పోషన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article