నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల ను పురస్కరించుకుని అవినీతి నిర్మూలన పోస్టర్ లను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అవిష్కరించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ శేఖర్ గౌడ్, ఎసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్, ఇన్స్ పెక్టర్ నగేష్ లు కలిసి ఆవిష్కరించారు.
. . . నేడు అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా ర్యాలీ
అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఎసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా నుంచి దేవి రోడ్ చౌరస్తా వరకు విద్యార్థుల చేత ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ర్యాలీని ఉధయం 10 గంటలకు జండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు పాల్గొంటారని డిఎస్పీ తెలిపారు..
