. రూ.కోటీ 30లక్షల పోగొట్టుకుని..
. ఆత్మహత్య చేసుకున్న కామారెడ్డికి చెందిన యువకుడు
కామారెడ్డి, బతుకమ్మ : ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. పట్టణంలోని దేవునిపల్లికి చెందిన చాకలి చింటు(27) ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ.కోటీ 30లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చింటు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.