28.8 C
Hyderabad
Monday, August 3, 2026

వైభవంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛాలతో కలుష పూజ, రుద్రాభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, మహా చండీ హోమం నిర్వహించారు. దేవత మూర్తులకు వెండి ఆభరణాలతో అలంకరించారు. భజనలు సంకీర్తనలతో ఆలయం మారుమ్రోగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article