హైదరాబాద్, బతుకమ్మ : సరూర్నగర్ లోని నల్ల పోచమ్మ గుడి దగ్గర ప్ర్రీతి శ్రావ్య పారడైస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని,ఆ గణనాథుని ఆశీస్సులు దీవెనలు ప్రజలపై ఉండాలని కోరుతున్నామన్నారు. ఈరోజు నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో సుమారు 500 మంది పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రీతి శ్రావ్య వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి సుధాకర్, సెక్రటరి పి సత్యానంద్, కోశాధికారి శ్రీనివాస్ రావు,అడ్వైజర్ ద్వారకానాథ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రీతి శ్రావ్య పారడైస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
