24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బీడీఎస్‌ఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా ఆనంద్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (బీడీఎస్‌ఎఫ్) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా బైసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్‌ను నియమించినట్లు బీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు తల్లారె సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల బీడీఎస్‌ఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆనంద్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తల్లారె సంజయ్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బహుజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆనంద్ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల సాధన, విద్యా రంగ సమస్యలపై పోరాటం, విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆనంద్ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జిల్లాలో బహుజన విద్యార్థుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

 

Anand appointed as BDSF Convener for the united Adilabad district.

More articles

Latest article