బీడీఎస్‌ఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా ఆనంద్

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (బీడీఎస్‌ఎఫ్) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా బైసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్‌ను నియమించినట్లు బీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు తల్లారె సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల బీడీఎస్‌ఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆనంద్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తల్లారె సంజయ్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బహుజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆనంద్...