నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ఐదవ సెమిస్టర్ విద్యార్థులకు కోర్సులో భాగంగా గురువారం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ అంశంపై మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా నిజామాబాద్ న్యాయవాది ఆర్.రామా గౌడ్ హాజరయ్యారు. ఇంటర్నల్ ఎగ్జామినర్ గా న్యాయ శాస్త్ర విభాగం చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డాక్టర్. బి.స్రవంతి వ్యవహరించగా డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా, డాక్టర్ నాగజ్యోతి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
