Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2025, 5:33 pm Posted by : ramakrishna

ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ పై బహిరంగ పరీక్ష

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో  ఐదవ సెమిస్టర్   విద్యార్థులకు కోర్సులో భాగంగా గురువారం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్  రిసొల్యూషన్ అంశంపై  మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు  ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా  నిజామాబాద్ న్యాయవాది  ఆర్.రామా గౌడ్ హాజరయ్యారు.  ఇంటర్నల్ ఎగ్జామినర్ గా  న్యాయ శాస్త్ర విభాగం  చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్  డాక్టర్. బి.స్రవంతి వ్యవహరించగా డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా, డాక్టర్ నాగజ్యోతి  విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.