రుద్రూర్, బతుకమ్మ : భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మీద చెరగని ముద్ర వేసిన మహానీయుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరిచంద్రశేఖర్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం అన్నారు. గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారంలు మాట్లాడుతూ… 1991లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సరళి విధానం వల్లనే ఈరోజు భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని వారు అన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మీద చెరగని ముద్ర వేసిన మహానీయుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని వారు కొనియాడారు. భౌతికంగా కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లినప్పటికీ ఆయన సంస్కరణలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, కర్క అశోక్, షేక్ నిస్సార్, సుదర్శన్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ వడ్ల నరేష్, మేక వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
