ప్రజాస్వామ్య వ్యవస్థ మీద చెరగని ముద్ర
రుద్రూర్, బతుకమ్మ : భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మీద చెరగని ముద్ర వేసిన మహానీయుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరిచంద్రశేఖర్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం అన్నారు. గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం...