. చాయ్ మీద పడిందని కార్యకర్తపై నాయకుడి ఆగ్రహం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో మైనార్టీ విభాగం సీనియర్ నాయకుడితో ఓ కార్యకర్త బాహాబాహీకి దిగాడు. ఇదంతా ప్రజాపాలన విజయోత్సవాల ఇన్ చార్జి వేణుగోపాలచారి ముందే జరిగింది. చాయ్ ఇచ్చే సమయంలో మీద పడడంతో పార్టీ మైనార్టీ విభాగం సీనియర్ నాయకుడు జావిద్ అక్రమ్ తనతో దుర్భాషలాడారని కార్యకర్త ముషుపటేల్ వాగ్వావాదానికి దిగాడు.

