27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులకు జీరో అకౌంట్ ఖాతాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ముప్కాల్ :  విద్యార్థులు స్కాలర్షిప్ డబ్బులు, వ్యక్తిగతంగా డబ్బులు జమ చేసుకోవడానికి బ్యాంక్ ఖాతాలు ఉపయోగపడతాయని ఎస్ బి ఐ డొంకల్ బ్రాంచ్ మేనేజర్ మనోహర్ అన్నారు. ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 25 మంది విద్యార్థులకు ఆయన జీరో అకౌంట్ ఖాతాలు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎస్.బి.ఐ మేనేజర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, మదర్, మురళి, ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article