29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా మహిళా గాజుల పండగ

Must read

📰 Generate e-Paper Clip

  • వంటా వార్పు, ఆట, పాటల నడుమ దోస్తుల గాజులు

 

మోర్తాడ్, బతుకమ్మ : జిల్లా వ్యాప్తంగా మహిళా దోస్తుల గాజుల పండగ ట్రెండ్ గా మారింది. దోస్తులు గాజులు వేసుకుంటే బాగుంటారన్న సాంప్రదాయంతో ఏకీభవించి మహిళాలు గ్రాండ్ గా ఈ గాజుల పండుగ జరుపుకొంటున్న విషయం విధితమే. శనివారం మండలంలోని సుంకేట్ గ్రామానికి చెందిన మాదిగ కడారి సంఘం మహిళలు గాజుల పండగను కన్నుల పండువుల నిర్వహించుకొన్నారు. సంఘానికి చెందిన మహిళలందరు స్థానిక శుక్రవారం దేవి సన్నిధిలో ఏకరూప దుస్తులను ధరించి, ముందుగా గోరింటాకును ఒకరినొకరు పెట్టుకొన్నారు. అందరు పసుపు, కుంకుమ,పూలు ధరించి సాంప్రదయ బద్దంగా ఒకరినొకరు వారి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ గాజులు వేసుకొన్నారు. అనంతరం వంటలు చేసుకొని భోజనాలు చేశారు. తదనంతరం కాలక్షేపనికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కబాడీ, కోకో తదితరులు ఆటలను ఆడారు. అంత్యక్షరీ, పాటలు పాడుతూ ఆనందోత్సహల మధ్య గాజుల పండగను నిర్వహించుకొన్నారు.

More articles

Latest article