రాజ్యాంగబద్దంగా ప్రజా సేవ చేస్తా

  • గ్రూప్-2 ర్యాంకర్ మాదరి ఆనంద్  

 

నిజామాబాద్, బతుకమ్మ: నిర్ణీత లక్ష్యం పెట్టుకొని, తన ఆశయ సాధన కోసం  గ్రూప్స్ పరీక్షలకు సిద్దమై విజయం సాదించాడు మాదరి ఆనంద్ కుమార్. ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో బిసి సి లో రాష్ట్ర వ్యాప్తంగా అయిదవ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ ప్రకారం జిఏడి, సచివాలయంలో ఏఎస్ఓగా, లేదంటే కో ఆపరేటివ్ శాఖలో రిజిస్త్రార్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటివల విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లోనూ 448 ర్యాంక్ రాగా, రీ కౌంటింగ్ అనంతరం మంచి ఉద్యోగం రావచ్చనే ఆశాభావంతో ఉన్నాడు.

  • డిల్లీలో ఉద్యోగం వదిలీ…

తెలంగాణ  ప్రభుత్వ హయంలో ఉద్యోగాలు ఉంటాయన్న ఆశతో డిల్లీలో ఐదంకెల్లో జీతం ఉన్నా దానిని వదులుకొని ఆరేళ్ళుగా హైదరాబాద్ లో చదవడం మొదలెట్టాడు. నిరీక్షణ  ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కొలువులు రావడంతో ఆనంద్ సంతోషానికి  అవధులు లేకుండా పోయింది. నిరుడు విడుదల చేసిన గ్రూప్ 4 ఫలితాల్లో కమర్షియల్ టాక్స్ లో ఉద్యోగానికి ఎంపిక కావడంతో అందులో చేరాడు. వ్యవసాయ కుటుంబ నేపద్యం నుంచి వచ్చిన ఆనంద్ కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామవాసి.  ఫార్మసీలో మాస్టర్స్ చదివి డిల్లీలో రాన్బాక్షి కంపెనీలో హోదాపరంగా ఉన్నతమైన ఉద్యోగాన్ని కొన్నాళ్ళపాటు చేసాడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడడంతో ప్రభుత్వ కొలువు కోసం పట్నం చేరి ఆలస్యమైనా అనుకున్నది సాధించడంతో తల్లి కరుణ, తండ్రి ఆనంద్, సతీమణి తేజస్విని ఆనందబాష్పాలు రాలుస్తున్నారు. గ్రూప్ 2 లో మెరుగైన ర్యాంక్ సాధించిన మాదరి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ సహచరుడు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ బండి గంగాధర్, ఎన్ఆర్ఐ రాయదాస్ తన మిత్ర బృందం ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనన్నాడు. రాజ్యాంగబద్దంగా ప్రజా సేవ చేసేందుకు అహర్నిశలు సంసిద్దుడనై ఉంటానని భావోద్యేగంతో తెలిపాడు. ఆనంద్ సతీమణి తేజస్విని కామారెడ్డి జిల్లాలోని రెవిన్యూ విభాగంలో సీనియర్ సహాయకురాలిగా విధులు నిర్వహించగా, తమ్ముడు చెన్నైలోని ప్రముఖ కంపెనీలో సివిల్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

Will serve the public constitutionally
Comments (0)
Add Comment