. . . ఇందూర్ రణభేరి లో ఎంపీ అర్వింద్ ధర్మపురి
నిజామాబాద్, బతుకమ్మ:
రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత చదువుకు కారణమైన ఫీజు రియంబర్స్ మెంట్ రూ.12 వేల కోట్ల బకాయిలు అడిగితే 40 శాతం సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ అడిగిండు అని నిజామాబాద్ పార్లమెంట్ ధర్మపురి అర్వింద్ అరోపించారు. శుక్రవారం పీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బిజెపి, బిజేవైయం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ఇందూర్ రణ బెరి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ…ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకపోతే ఓక జనరేషన్ కతం అవుతుంది అన్నారు. ఉన్నత చదువులు చదివిన ఎక్కిన నిచ్చిన ఓక్కసారి కూలిపోతుంది. ప్రజా సంఘాలు, మెధావులు, ప్రజలు కలిసి కోట్లాడాలి. అశోక్ నగర్ లో రాహుల్ గాంధి, రేవంత్ రెడ్డి లు విద్యార్ధులను, యువతను రెచ్చగొట్టి కేసీఆర్ ను గద్దె దించి అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత విద్యార్థులు, యువత కు అవసరమైన సంక్షేమ పథకాలు బంద్ చేసి మోసం చేసిండన్నారు. నాకు ఇప్పటికే నిజామాబాద్ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పోన్ చేసి రేవంత్ రెడ్డికి 40 శాతం కమిషన్ ఇవ్వడానికి సిద్ధమని అరవింద్ తెలిపారు. రాయదుర్గంలో కోట్ల రూపాయాల భూములు అమ్మి సొమ్ము చేసుకున్న విద్యార్థులు మాత్రం ఫీజు రియంబర్స్ మెంట్ కు నిధులు లేవనడం విడ్డురం అన్నారు. ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి రేవంత్ రెడ్డి. ముగ్గురు వివిధ సంక్షేమ మంత్రులు. ఉండగా రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ కోసం అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి పుట్ బాల్ అడుతున్నారు.. మనుమడికి పూరిలు చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.
ఇందూర్ గడ్డ మీద నుంచి పుట్టింది ఫీజు రియంబర్స్ మెంట్ పథకం…
ఫీజు రియంబర్స్ మెంట్ అనేది నా కుటుంబానికి చాలా దగ్గర ఐనా అంశం . ఇందూర్ గడ్డ మీద పుట్టింది ఫీజు రియంబర్స్ మెంట్ అని ఎంపీ అరవింద్ అన్నారు. నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ని తన తండ్రి ఎలా ఒప్పించింది గుర్తు చేసుకున్నారు. నేడు ఇందూర్ గడ్డ మీద మొదలైన ఉద్యమం ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు కోసం ఉద్యమం అనాటి యాది గుర్తుకు వచ్చిందన్నారు. ఇందూర్ గడ్డకు సాఫ్ట్ వేర్ లో అమెరికా లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిఇఓలు, యువత రుణపడి ఉండాలి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ ఆలోచన మేరకు ఉన్నత విద్య కోసం ఫీజు రియంబర్స్ మెంట్ అమలు లోకి వచ్చిందన్నారు.2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత పీసీసీ చీఫ్ డిఎస్ ఎన్నికల మేనిఫెస్టో అమలుకు సీఎం రాజశేఖర్ రెడ్డిని ఒప్పించారు అని గుర్తు చేశారు. నాటి ఫీజుల కారణంగా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, దళితులు, గిరిజనులతో పాటు పేద అగ్రవర్ణాల పేదలు ఉన్నత విద్యా దూరమై డిగ్రీ చదువులకు పరిమితమయ్యారు. అప్పటి పెద్దలు డి ఎస్ ఆలోచన మేరకు రాష్ట్ర స్థితిగతులను మార్చి, దేశ జిడిపి మార్చిన స్కీం ఇది అన్నారు
రేవంత్ పాలనలో విద్యార్థులకు.. యువతకు గడ్డు కాలం….
రేవంత్ రెడ్డి పాలనలో ఫీజు రియంబర్స్ మెంట్ కు గడ్డు కాలం వచ్చిందన్నారు ఎంపి అరవింద్. సీఎంగా గెలవగానే 10 వేల కోట్లు, 2 వేల కోట్ల కొత్త బకాయిలను యువ వికాసం పథకం కు ముందే క్లియర్ చేస్తామని అన్నారు. ఆగస్టు లోపలికి ఫీజు బకాయిల అడగవద్దని యాజమాన్యాల వరకు కోరిన ప్రభుత్వం ఒక్క రూపాయి విదిల్చింది లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే విద్యార్థులు రేవంత్ రెడ్డిని బొంద పెడతారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే… రేవంత్ ఆగమాగం చేస్తుండు… రేవంత్, కేసీఆర్ కంటే పెద్ద డిజాస్టర్.. రాష్ర్టంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఖతం చేస్తుండు అని అనాడు చెప్పిన ఇప్పుడు అప్పుల పేరుతో అగం చేస్తున్నాడు అన్నారు. కరప్షన్ లేని సర్కార్ రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ పీఎం మోదీ అధ్వర్యంలో తెలంగాణలో ఏర్పడుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ తోనే విద్యార్థులు, యువత వికాసం అన్నారు.
ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి తో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి తో పాటు కార్పొరేటర్ బిజేవైఎం, బిజేపి, ఎబివిపి నాయకులు , విద్యార్థులు పాల్గొన్నారు.