25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అసలు ఐకెపి కార్యాలయంలో ఏం జరుగుతుంది..?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గ్రూపు సభ్యులకు తెలియకుండానే సుమారు రెండు లక్షల రూపాయలు స్వాహా

 

. . . ఇందులో ఐకెపి ఎపిఎం వాటా ఎంత?.. సీసీ వాటా ఎంత?

 

. . . ఈ విషయంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో డ్వాక్రా గ్రూపు ఏపిఎం, సీసీ ఇద్దరూ కుమ్మక్కై వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ  మొదటి లీడర్, రెండవ లీడర్ సంతకాలు లేకుండా,  గ్రూపులో ఉన్న సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సుమారు రెండు లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు బహిర్గతంగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఒక డ్వాక్రా గ్రూపులో 10 మంది సభ్యులు ఉండగా, తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఏపిఎం, సీసీ  పైసలు స్వాహా ఎలా చేస్తారని, గ్రూపులో మేము లీడర్లుగా ఉండి ఎందుకని, ఏమైనా కొత్త సిస్టం వచ్చిందా, అలాంటప్పుడు మేము మీటింగ్లకు రావడం ఎందుకని గ్రూపు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మొదటి, రెండవ గ్రూపు సభ్యులకు  ఎలాంటి సమాచారం లేకుండా ఐకెపి ఏపిఎం, సీసీలు కలిసి ఇష్టానుసారంగా వ్యవహరించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించుకుంటున్నారు. అదేవిధంగా  గ్రూపులో మెంబర్ కు, సభ్యులకు ఇలాంటి సమాచారం లేకుండానే గ్రూపులో సభ్యత్వం ఎలా ఇస్తారని, సభ్యత్వం ఇచ్చిన రెండు రోజుల్లోనే వారికి రూ. 2 లక్షల రుణం ఎలా ఇస్తారని ప్రశ్నించుకుంటున్నారు. అలాగే ప్రతి గ్రూపులో మొదటి లీడర్, రెండవ లీడర్లను ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్లకు సంబంధం లేనప్పుడు మొదటి లీడర్, రెండవ లీడర్ సంతకాలు ఎందుకని  డ్వాక్రా గ్రూపు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అంబేద్కర్ విఓలో ఒక గ్రూపులో 10 మంది సభ్యుల్లో ఒక సభ్యురాలు 60 సంవత్సరాలు పై బడినందున ఆ సభ్యురాలిని తొలగించి, కొత్త సభ్యురాలిని సభ్యుల అనుమతి లేకుండా, సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా, సభ్యులకు తెలియకుండానే గ్రూపులో చేర్చుకుని అకౌంట్ లో నుండి వెంటనే పొదుపు పైసలు రూ.2 లక్షలు డ్రా చేశారని సభ్యులకు మెసేజ్ రావడం వలన ఈ విషయం తెలియడంతో సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  ఈ విషయంపై సీఏకు మాట్లాడగా అవును నిజమే మాకు పైనుండి ఒత్తిడి రావడంతో 60 సంవత్సరాలు దాటిన మెంబర్ స్థానంలో కొత్త సభ్యురాలిని చేర్చుకున్నామని, మళ్లీ వాళ్లు ఒత్తిడి చేయడంతోనే లోను కూడా మంజూరు చేసి పదిమంది సభ్యుల సంతకాలు లేకుండానే, మా సార్ చెప్పినట్లు పదిమంది సభ్యుల సంతకాలు చేసి అది కూడా మొదటి లీడర్ స్థానంలో రెండవ లీడర్ సంతకము, రెండవ లీడర్ స్థానంలో మొదటి లీడర్ సంతకం చేసి ఆమెకు లోన్ ఇవ్వడం జరిగిందన్నారు. దీంట్లో ఇంకా ఎన్నో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే దీంట్లో ఏపిఎం వాటా ఎంత?.. సీసీ వాటా ఎంత?.. అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మహిళా సంఘ సభ్యులకు సంబంధించిన రుణాలపై ఉన్నత స్థాయి అధికారులతో పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే  నిజ నిజాలు బయటకు వస్తాయని గ్రూపు సభ్యులు పేర్కొన్నారు.

More articles

Latest article