దివంగత కానిస్టేబుల్ పై నిజనిర్ధారణ కమిటి తప్పుడు ఆరోపణలు ఖండిస్తున్నాం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పోలీస్ శాఖలో మంచి ప్రవర్తన కలిగిన దివంగత కానిస్టేబుల్ ప్రమోద్ పై తప్పుడు ఆరోపణలు చేసిన నిజ నిర్దారణ కమిటీ (ఫ్యాక్ట్ ఫైండ్ కమీటి) తీరును మాల మహానాడు, ప్రజా సంఘాలు ఖండించాయి. అదివారం జిల్లా కేంద్రంలో మాలమహానాడు నాయకులు అలుక కిషన్, ప్రజా సంఘాల నాయకులు రమేష్ బాబు, దండి వెంకటి, మాల మహానాడు నాయకులు బంగారు సాయిలు, చొక్కం దేవిదాస్, అనంపల్లి ఎల్లయ్య, రాంచంధర్ గైక్వాడ్ లు మాట్లాడుతూ… సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ పై 61 కేసులు, రెండు హత్యాయత్నాల కేసులు ఉంటే ఏవిధంగా రికవరీ ఏజెంట్ అయ్యాడని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా పరారీలో ఉన్న రియాజ్ ను పట్టుకునేందుకు వెళ్లినప్పుడు  కానిస్టేబుల్ ప్రమోద్ ని రియాజ్ హత్య చేసాడని ప్రపంచానికి తెలుసు అని అన్నారు. దివంగత కానిస్టేబుల్ ప్రమోద్ పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదు అన్నారు. నిజనిర్దారణ కమిటీ ఎక్కడో కూర్చుని విచారణ చేయటం కరెక్ట్ కాదు అని తెలిపారు. రియాజ్ దాడిలో చనిపోయిన ప్రమోద్ కుటుంబాన్ని పరామార్శించకపోగ మృతుడు ప్రమోద్ పై తప్పుడు ఆరోపణలు రావటం, రియాజ్ కుటుంబం ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. పోలీసులు రియాజ్ కుటుంబాన్ని వేధించారనటం తప్పుడు ఆరోపణలు అని దివంగత కానిస్టేబుల్ ప్రమోద్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. రియాజ్ ఓ రౌడీ షీటర్.. మొత్తం ఘటన మీద నిజ నిర్దారణ కమిటీ తప్పుడు సంకేతాలు ఇవ్వటం ఎవరి కోసమో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఫ్యాక్ట్ ఫైండ్ కమిటికి చట్టబద్ధత ఉందా అని ప్రశ్నించారు. ప్రమోద్ మీద తప్పుడు ఆరోపణలు, అబాండాలు వేయటం మంచి పద్ధతి కాదని, నిజ నిర్దారణ కమిటీ వ్యవహార శైలి సరిగా లేదన్నారు. దివంగత ప్రమోద్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఫ్యాక్ట్ ఫైండ్ కమిటిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

We condemn the false allegations made by the fact-finding committee against the late constable.
Comments (0)
Add Comment